కోటిలింగాల

కోటిలింగాల

గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ గ్రామంలో కోటి లింగాలు ఉన్నాయన్నది ప్రజల నమ్మకం. గ్రామంలో ఎక్కడ చూసినా లింగాలు,శిల్ప కళాఖండాలు, ఖండికలు కన్పిస్తాయి. ఇక్కడ తవ్వకాల్లో శాతవాహనుల కాలం నాటి నాణాలు, స్మారక చిహ్నాలు వెలుగు చూశాయి. అయితే ఇక్కడ కోటి లింగాలు లేవని..ఈ కోటలో కోటీశ్వర,సిద్దేశ్వర లింగాలు ఉండటం వల్లే కోటి లింగాలుగా పిలుస్తూ క్రమేణా కోటిలింగాలుగా మారిందనే మరో వాదనా ఉంది. శాతవాహనుల కాలంలో సరుకుల ఎగుమతులు..దిగుమతులకు ఇది ఓడరేవుగా ఉండేదని కోట ఉత్తర భాగాన గోదావరి నీటి వరకూ గల ప్రాచీన కట్టడాల వల్ల తెలుస్తుంది.ఈ కోటిలింగాల కరీంనగర్ జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో పెద్దవాగు, గోదావరి నది సంగమ స్థానంలో ఉంది. కోటిలింగాల శాతవాహనుల మొదటి రాజధానిగా చెబుతారు. ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోకి వెళ్ళింది.

కరీంనగర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it