అద్భుతం..ఆదియోగి విగ్రహము

అద్భుతం..ఆదియోగి  విగ్రహము

కోయంబత్తూర్ పేరు చెప్పగానే ఇప్పుడు అందరికి గుర్తు వచ్చేది ఆదియోగి శివుడి విగ్రహమే. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతం చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఒక వైపు చుట్టూ పశ్చిమ కనుమలలోని వెల్లగరి కొండలు ...మరో వైపు మధ్యలో ఎత్తైన శివుడి విగ్రహము. చూపరులకు ఈ ప్రాంతం ఎంతో కనువిందు చేస్తుంది అనటంలో సందేహం లేదు. ఐదు వందల టన్నుల ఇనుముతో నిర్మించిన ఈ ఆదియోగి శివుడి విగ్రహము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రతిమ విగ్రహము. ఈ విగ్రహము ఎత్తు 112 అడుగులు. అతిపెద్ద ప్రతిమ విగ్రహంగా ఇది గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కింది. కోయంబత్తూర్ నుంచి ఇది 32 కిలోమీటర్ ల దూరంలో ఉంటుంది. వేసవిలో అయితే ఉదయం...సాయంత్రం సమయాలు ఈ ప్రాంతాన్ని సందర్శించటానికి అనువైన సమయం. ఇతర సీజన్స్ లో అయితే మన సౌలభ్యం ప్రకారం వెళ్లొచ్చు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ కు చెందిన ఇషా ఫౌండేషన్ ఈ ప్రాజెక్ట్ చేపట్టింది.

ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2017 ఫిబ్రవరి 24 న ప్రధాని నరేంద్ర మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.యోగా ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ తలపెట్టారు. యోగా కు మూలగురువు శివుడే అని చెపుతారు. అందుకే ఈ విగ్రహానికి కూడా ఆదియోగి గా నామకరణం చేశారు. ఇషా యోగా కాంప్లెక్స్ లో ఫస్ట్ ఆదియోగి విగ్రహము ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తర్వాత లోపలి వెళితే ధ్యాన మందిరం తో పాటు పలు దేవాలయాలు ఉంటాయి. ఇక్కడ యోగా పై ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు కూడా ఉంటారు. ఇక్కడే ధ్యాన లింగ తో పాటు లింగ భైరవి, సూర్యకుండ్, చంద్రకుండ్ వంటి సందర్శన ప్రాంతాలు ఉంటాయి.

Similar Posts

Recent Posts

International

Share it