దేశీయ విమాన టికెట్ ధరలపై పరిమితి మరో మూడు నెలలు

దేశీయ విమాన టికెట్ ధరలపై పరిమితి మరో మూడు నెలలు

దేశీయ విమాన సర్వీసులకు సంబంధించి టిక్కెట్ ధరలపై పరిమితి మరో మూడు నెలలు కొనసాగనుంది. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. ఆయన గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. మే 21 నుంచి విమానయాన శాఖ మొత్తం ఏడు బ్యాండ్లలో టిక్కెట్ ధరలు నిర్ధారించింది. ఆయా రూట్లలో ప్రయాణ సమయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కనిష్ట, గరిష్ట రేట్లను నిర్ధారించారు.

దేశీయ విమాన సర్వీసులు ఈ సంవత్సరాంతానికి కరోనా ముందు నాటి పరిస్థితులకు రావొచ్చని..అప్పుడు ఈ ఛార్జీలపై పరిమితిని ఎత్తేయటానికి ఏ మాత్రం వెనకడుగు వేయబోమని తెలిపారు. కేంద్రం ప్రకటించిన ధరల ప్రకారం కనీస ఛార్జీ 2500 రూపాయాలు ఉండగా గరిష్ట ధర 18600 రూపాయాలు గా ఉంది. ఆయా సెక్టార్లను బట్టి..ఈ రేట్లను నిర్ధారించారు. ఇప్పుడిప్పుడే దేశీయ విమానయాన ఊపందుకుంటోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కూడా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ప్రయాణికుల సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it