సౌదీ అరేబియాకు స‌ర్వీసులు ప్రారంభించిన‌ ఎయిర్ ఇండియా

సౌదీ అరేబియాకు స‌ర్వీసులు ప్రారంభించిన‌ ఎయిర్ ఇండియా

యునైటెడ్ అర‌బ్ ఏమిరేట్స్ (యూఏఈ) దేశాలు వ‌ర‌స పెట్టి ప్ర‌యాణ ఆంక్షలు తొల‌గిస్తున్నాయి. ఈ మేర‌కు వ‌రస పెట్టి ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నాయి. ఈ త‌రుణంలో ఎయిర్ ఇండియా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త్ నుంచి సౌదీ అరేబియాకు విమాన స‌ర్వీసులు ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా అప్ డేట్స్ ఇచ్చింది. అయితే టిక్కెట్లు బుక్ చేసుకునే ముందు ప్ర‌యాణ మార్గ‌ద‌ర్శ‌కాలు చూసుకోవాల‌ని సూచించింది. ఎయిర్ ఇండియా వెబ్ సైట్ తోపాటు ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కూడా సౌదీ అరేబియాకు టిక్కెట్లు బుక్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది.

డ‌బ్ల్యూహెచ్ వో ఆమోదించిన వ్యాక్సిన్ల రెండు డోసులు పూర్తి చేసుకున్న వారికి అనుమ‌తులు ఇస్తున్నాయి ప‌లు దేశాలు. అయితే సంబంధిత స‌ర్టిఫికెట్ ను ప్ర‌యాణికులు చూపించాల్సి ఉంటుంది. అయితే కొన్ని చోట్ల ప్ర‌యాణానికి ముందు 48 గంట‌ల ముందు కొన్ని దేశాలు..మ‌రికొన్ని 72 గంట‌ల ముందు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయంచుకుని నెగిటివ్ స‌ర్టిఫికెట్ చూపించాల‌ని కోరుతున్నాయి.

Similar Posts

Recent Posts

International

Share it