ఎయిర్ ఇండియా బ్యాగేజ్ పరిమితి పెంపు

ఎయిర్ ఇండియా బ్యాగేజ్ పరిమితి పెంపు

కరోనా సంక్షోభం నుంచి ఇఫ్పుడిప్పుడే విమానయాన రంగం గాడిన పడుతోంది. కొద్ది రోజుల క్రితమే పౌరవిమానయాన శాఖ బ్యాగేజ్ విషయంలో నిర్ణయాన్ని ఎయిర్ లైన్స్ కే వదిలేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో పరిమిత బ్యాగేజ్ తోనే పర్యటనలకు అనుమతి ఇఛ్చారు. దేశంలోని అగ్రశ్రేణి ఎయిర్ లైన్స్ అయిన ఎయిర్ ఇండియా కొత్తగా బ్యాగేజ్ ఆఫర్లను ప్రకటించింది. తమ విమానాల్లో ఎకానమీ టిక్కెట్ పై 25 కిలోలు, బిజినెస్ క్లాస్ టిక్కెట్ పై 35 కిలోల బ్యాగేజ్ ను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.

'వెల్ కం బ్యాక్ హెవీ వెయిట్' అంటూ ప్రయాణికులకు సమాచారం అందించింది. దేశంలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో రాబోయే రోజుల్లో విమానయానం సాధారణ స్థితికి చేరుకుంటుందనే అంచనాలు వెలువుడుతున్నాయి. దీనికి తోడు వచ్చేది పండగల సీజన్ కావటంతో ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరిగే అవకాశం ఉందని ఎయిర్ లైన్స్ అంచనాలు వేస్తున్నాయి.

Similar Posts

Recent Posts

International

Share it