గోల్కొండ..ఛార్మినార్ సందర్శనపై నిషేధం

గోల్కొండ..ఛార్మినార్ సందర్శనపై నిషేధం

పెరుగుతున్న కరోనా కేసులతో మరోసారి పర్యాటకులపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. భారత పురావస్తు శాఖ పరిధిలోని పర్యాటక కేంద్రాల సందర్శనపై నిషేధం విధించారు. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం మే 15 వరకూ కొనసాగనుంది. ఈ ఆంక్షలు సత్వరమే అమల్లోకి రానున్నాయి. పురావస్తు శాఖ పరిధిలో ఉండే రక్షిత కట్టడాలు, మ్యూజియాలు, ఇతర సందర్శన ప్రాంతాల విషయంలో నిషేధం అమల్లోకి రానుంది. ఒక్క తెలంగాణ, ఏపీలోనే కాదు..దేశమంతటా ఈ నిషేధం అమల్లోకి వచ్చింది.

Similar Posts

Recent Posts

International

Share it