ఐదు కొండల నడుమ అందమైన గ్లాస్ బ్రిడ్జి

ఐదు కొండల నడుమ అందమైన గ్లాస్ బ్రిడ్జి

చైనాలో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద గ్లాస్ బ్రిడ్జి ఎక్కాలంటే అందరికీ సాధ్యం కాదు. కానీ అలాంటి అనుభూతి పొందాలంటే ఇప్పుడు చైనా వరకూ వెళ్ళక్కర్లేదు. దేశంలోని బీహార్ లోనే ఐదు కొండల మధ్య అందమైన గ్లాస్ బ్రిడ్జిని నిర్మించారు. ఇది కూడా కొత్త సంత్సరంలోనే అందుబాటులోకి రానుంది. నలంద జిల్లాలోని రాజ్ గిర్ వద్ద 200 అడుగుల గ్లాస్ బ్రిడ్జిని నిర్మించింది. ఐదు కొండల నడుమ నిర్మించిన ఈ బ్రిడ్జి పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని ఇవ్వనుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కొత్త ప్రాజెక్టుతో దేశీయ పర్యాటకులతోపాటు విదేశీ పర్యాటకులను కూడా ఆకట్టుకోవచ్చని బీహార్ సర్కారు అంచనా వేస్తోంది.

ఇటీవలే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ బ్రిడ్జిని పరిశీలించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇఫ్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బీహర్ లో కొత్తగా నిర్మించిన ఇది చైనాలోని హంగ్జ్యూ బ్రిడ్జి తరహాలోనే నిర్మించారు. ఈ బ్రిడ్జి పై ఒకేసారి 40 సందర్శకులను అనుమతించే అవకాశం ఉంటుంది. నలంద జిల్లా బీహార్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. చారిత్రక పరంగా, సాంస్కృతిక పరంగా ఈ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పురాతనమైన నలందా యూనివర్శిటీ ఇక్కడే ఉంది.

Similar Posts

Recent Posts

International

Share it