భారత్ విమానాలపై నిషాదాన్ని పొడిగించిన కెనడా

భారత్ విమానాలపై  నిషాదాన్ని పొడిగించిన కెనడా

కెనడా మరోసారి భారత్ విమానాలపై నిషేధాన్ని పొడిగించింది. జూన్ 21 వరకూ భారత్ నుంచి ప్రయాణికుల విమానాలను అనుమతించబోమని వెల్లడించారు. తొలుత ఏప్రిల్ 22 నుంచి నెల రోజుల పాటు విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఆ గడువు ముగియటంతో మరోసారి నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ఆ దేశ రవాణా శాఖ మంత్రి ఓమర్ అల్ గాబ్రా వెల్లడించారు. కెనడాలో ప్రస్తుతం కరోనా కేసులు గణణనీయంగా తగ్గుముఖం పట్టాయి.

అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత్ తోపాటు పాకిస్థాన్ నుంచి వచ్చే విమానాలను కూడా జూన్ 21 వరకూ అనుమతించబోమని ప్రకటించారు. అయితే కార్గో విమానాలు మాత్రం ఎప్పటిలాగానే నడుస్తాయి. అమెరికా నుంచి కూడా అత్యవసరం కాని ప్రయాణాలపై కెనడా ఆంక్షలు కొనసాగిస్తోంది. అయితే ఇతర దేశాల ద్వారా కెనడాకు వెళ్ళటానికి మాత్రం అవకాశం ఉంటుంది. అయితే ప్రయాణికులు కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it