మూడేళ్లు సముద్రంలో టూర్..ఏకంగా 135 దేశాలు

మూడేళ్లు సముద్రంలో టూర్..ఏకంగా 135 దేశాలు


తొలి సారి క్రూయిజ్ లో మూడేళ్ళ ప్రపంచ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో 135 దేశాలు కవర్ అవుతాయి. ఇది మూడేళ్ళ పాటు సాగనుంది. అయితే ఇందులో ప్రయాణానికి ఏడాదికి కనీస టికెట్ ధర 24 .5 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. అంటే మూడేళ్లు ఇందులో తిరగాలంటే దానికి ఏకంగా 75 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇది ఒక్కో వ్యక్తికి మాత్రమే . ఈ క్రూయిజ్ నవంబర్ 1 న ఇస్తాంబుల్ నుంచి బయలుదేరనుంది. 135 దేశాల్లో మొత్తం 375 ప్రాంతాలను ఇది కవర్ చేయనుంది. ఇందులో కరీబియన్ దీవులతో పాటు అంటార్కిటికా, హవాయి, ఆసియా ఉంటాయి. ఈ టికెట్ ధరలో జిమ్, డిన్నర్, లాండ్రీ, హౌస్ కీపింగ్, ఇంటర్నెట్ , ఇతర సర్వీసులు కూడా ఉంటాయి. అంతే కాదు స్విమ్మింగ్ పూల్, 24 గంటలు అందుబాటులో ఉండే హాస్పిటల్,ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ క్రూయిజ్ లో 1074 మంది ప్రయాణికులు పట్టేలా 400 కేబిన్స్ ఉంటాయి.

దీన్ని సముద్రంలో ఇళ్ళుగా పిలుస్తారు. (హోమ్ ఎట్ సీ) పిలుస్తారు. ఈ టూర్ ప్రపంచంలోని 14 వింతల్లో 13 కవర్ చేస్తుంది. ఇందులో కూడా రెండు ప్యాకేజీ లు ఉన్నాయి. ఒక దానిలో ఒక్కో వ్యక్తికి 25 లక్షలు ఏడాది కి అవుతుంటే...మరో ప్యాకేజీ లో మాత్రం 90 లక్షలు అవుతుంది. లైఫ్ ఎట్ సీ క్రూయిజస్ ఈ టూర్ నిర్వహిస్తోంది. ప్రతి చోటా క్రూయిజ్ కొన్ని రోజులు ఆగుతుంది. అక్కడ ప్రయాణికులు తమకు నచ్చిన ప్రాంతాలు చూసి రావటానికి అనుమతిస్తారు. అంతే కాదు ఇది కరీబియన్ ద్వీపాలతో పాటు మొత్తం వంద ద్వీపాల దగ్గర ఆగుతుంది. దక్షిణ అమెరికా, అంటార్కిటికా లో ఇది 98 రోజుల పాటు టూర్ చేస్తుంది. ఇందులో ప్రయాణిస్తూ కూడా ఆఫీస్ పని చేసుకునే వెసులుబాటు ఉంటుంది అని నిర్వాహకులు ప్రకటించారు.

Similar Posts

Recent Posts

International

Share it