నవంబర్ 30 వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం

నవంబర్ 30 వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం

కరోనా కు ముందు తరహాలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇప్పట్లో ప్రారంభం అయ్యేలా లేవు. అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులను నవంబర్ 30 వరకూ నిషేదిస్తూ డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని నెలలుగా ఈ నిషేధాన్ని పొడిగిస్తూ వెళుతున్నారు. యూరప్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుతుండటం కూడా ఆందోళనకర పరిణామంగా పేర్కొన్నారు.

ప్రత్యేకంగా ఆమోదించిన అంతర్జాతీయ విమాన సర్వీసులు, ఎయిర్ కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించదు. భారత్ ఇప్పటికే పలు దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందాలు చేసుకుని అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సర్వీసులకు డీజీసీఏ ఆయా ఒప్పందాలకు అనుగుణంగా అనుమతులు మంజూరు చేస్తోంది.

Similar Posts

Recent Posts

International

Share it