జనవరి 15 నుంచి హైదరాబాద్- అమెరికా డైరక్ట్ ఫ్లైట్

జనవరి 15 నుంచి హైదరాబాద్- అమెరికా డైరక్ట్ ఫ్లైట్

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్ లోని జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికా కు డైరక్ట్ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ రంగంలోని ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా జనవరి 15 నుంచి హైదరాబాద్ -చికాగో కు సర్వీసులు నడపనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళాలంటే దేశ రాజధాని ఢిల్లీ లేదా దుబాయ్ ల మీదుగా వెళ్ళాల్సి వస్తోంది. ఇప్పుడు నేరుగా హైదరాబాద్ నుంచే అమెరికాకు ఎయిర్ ఇండియా సర్వీసులు ప్రారంభించనుండటంతో ఇది ప్రయాణికులకు ఎంతో అనువుగా ఉండనుంది. ఎయిర్ ఇండియా బోయింగ్ 777-200 ఎయిర్ క్రాఫ్ట్ ను చికాగోకు నడపనుంది.

238 సీట్ల సామర్ధ్యం ఉండే ఈ విమానంలో ఎనిమిది ఫస్ట్ క్లాస్, 38 బిజినెస్ క్లాస్, 195 ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయని జీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఏటా హైదరాబాద్ నుంచి అమెరికాకు ఏడు లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు నడపాలనే తమ ఏజెండాలో ఎప్పటి నుంచో ఉందని..ఎయిర్ ఇండియా సర్వీసుతో ఇది నెరవేరనుందని జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ సీఈవో ప్రదీప్ పనీకర్ తెలిపారు. అమెరికాకు చెందిన పలు ఐటి దిగ్గజ సంస్థలు, ఫార్మా సంస్థలు తెలంగాణలో బారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నందున ఈ సర్వీసులు ఎంతో ఉపయుక్తంగా మారతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar Posts

Recent Posts

International

Share it