దేశీయ విమాన ప్రయాణికుల్లో భారీ తగ్గుదల

దేశీయ విమాన ప్రయాణికుల్లో భారీ తగ్గుదల

విమానాయాన రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. నవంబర్ నెలలో దేశీయ విమాన ట్రాఫిక్ ఏకంగా 51 శాతం మేర తగ్గింది. డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ ఏడాది నవంబర్ లో 63.54 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఇది అంతకు ముందు ఏడాది ఇదే కాలం కంటే 51 శాతం తక్కువ. దేశీయ విమానయాన సంస్థలు అక్టోబర్ లో 52.71 లక్షల మందిని,సెప్టెంబర్ లో 39.43 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చాయి.

2020 జనవరి -నవంబర్ మధ్య కాలంలో దేశీయ ప్రయాణికుల సంఖ్య 5.56 కోట్లుగా నమోదు అయింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలం కంటే ఇది 57.54 శాతం తక్కువ. నవంబర్ నెలలో ఇండిగో 34.23 లక్షల మధ్య ప్రయాణికులను తీసుకెళ్ళింది. ఇది మొత్తం దేశీయ మార్కెట్ లో 53.9 శాతం. స్పైస్ జెట్ 8.4 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చింది. ఇది 13.2 శాతంగా డీజీసీఏ గణాంకాలు వెల్లడించాయి. నవంబర్ నెలలో ఎయిర్ ఇండియా, గో ఎయిర్, ఎయిర్ ఏషియా, విస్తారాలు వరసగా 6.56 లక్షలు, 5.77 లక్షలు, 4.21 లక్షలు, 3.97 లక్షల మధ్య ప్రయాణికులను వారి గమ్యాలకు చేర్చాయి.

Similar Posts

Recent Posts

International

Share it