దేశీయ విమాన సర్వీసులు 80 శాతానికి పెంపు

దేశీయ విమాన సర్వీసులు 80 శాతానికి పెంపు

దేశంలో కరోనా కేసులు నమోదు అవుతున్నా విమాన ప్రయాణికుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. త్వరలోనే కరోనాకు ముందు నాటి పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్ విజయవంతం అవటం ఏవియేషన్ తోపాటు పలు రంగాలకు ఊరటనిస్తోంది. తాజాగా కేంద్ర పౌరవిమానయాన శాఖ దేశీయ విమాన సర్వీసుల పరిమితిని 70 శాతం నుంచి 80 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మే నుంచి నేటి వరకు భారత విమానయాన సంస్థ ప్రీ-కోవిడ్ దేశీయ ప్రయాణీకుల విమానాలలో 70 శాతం నడిపిస్తుండగా. ఇప్పుడు ఆ సంఖ్యను ఈ రోజు(డిసెంబర్‌3) నుంచి 80 శాతానికి పెంచినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించారు.

ఈ మేరకు మంత్రి ట్వీట్‌ చేశారు. '30 వేల ప్రయాణికులతో మే 25న దేశీయ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యాయి.. నవంబర్ 30వ తేదీ నాటికి ఆ సంఖ్య 2.52 లక్షల గరిష్టాన్ని తాకింది. ఇప్పుడు.. దేశీయంగా ప్రస్తుతం ఉన్న విమానాలు 70 శాతం నుంచి 80 శాతం వరకు నడుపుకోవచ్చు'. అని ట్వీట్ చేశారు. అయితే అంతర్జాతీయ సర్వీసులపై నిషేధాన్ని మాత్రం డిసెంబర్ 31 వరకూ పొడిగిస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it