దుబాయ్ మరో వరల్డ్ రికార్డు

దుబాయ్ మరో వరల్డ్ రికార్డు

దుబాయ్ మరో ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా దుబాయ్ లోనే ఉంది. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద కలర్ ఫుల్ ఫౌంటేన్ కూడా దుబాయ్ లోనే కొలువుదీరింది. అంతే కాదు..ఈ ఫౌంటేన్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కింది. పర్యాటకులకు ఇప్పుడు దుబాయ్ లో మరో ప్రత్యేక ఆకర్షణ అందుబాటులోకి వచ్చినట్లు అయింది. పామ్ జుమేరా సమీపంలో ద పాయింటీ వద్ద ఈ పామ్ ఫౌంటేన్ ను ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి ఫౌంటేన్ ను ప్రారంభించారు. మల్టీకలర్ లైట్స్, వాటర్ బ్లాస్టింగ్ తో ప్రారంభించారు.

ఈ పౌంటేన్ 14 వేల చదరపు మీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఈ పౌంటేన్ చుట్టుపక్కల ఏకంగా 3000 ఎల్ ఈడీ లైట్లను అమర్చారు. ప్రతి ముప్పయి నిమిషాలకు మూడు నిమిషాల డ్యాన్సింగ్ వాటర్ కార్యక్రమం ఉంటుంది. భారతీయ భాషలకు చెందిన పాటలు కూడా ఉంటాయి ఇందులో. కొద్ది రోజుల క్రితమే దుబాయ్ పర్యాటకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో ఇది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పటికే బుర్జ్ ఖలీఫా దగ్గర ఫౌంటేన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Similar Posts

Share it