సూర్యోదయం చూస్తూ 'దుబాయ్ ఫ్రేమ్' పై బ్రేక్ ఫాస్ట్

సూర్యోదయం చూస్తూ దుబాయ్ ఫ్రేమ్ పై బ్రేక్ ఫాస్ట్

టిక్కెట్ ధర 2012 రూపాయలు

దుబాయ్ ఫ్రేమ్ కొత్త ఆఫర్

ప్రపంచంలోనే అతి పెద్ద పిక్చర్ ఫ్రేమ్ 'దుబాయ్ ఫ్రేమ్'. ఇప్పుడు ఓ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. 150 మీటర్ల ఎత్తులో ఉండే గ్లాస్ బ్రిడ్జి మీద కూర్చుని అల్పాహారం తీసుకోవచ్చు. దుబాయ్ అందాలను..ఎడాది దేశంలో అందమైన సూర్యోదయాన్ని చూస్తూ బ్రేక్ ఫాస్ట్ చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. దుబాయ్ లోని జబీల్ పార్కులో ఉన్న దుబాయ్ ఫ్రేమ్ గత కొన్ని సంవత్సరాలుగా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నలభైవ అంతస్థులో ఉండే గ్లాస్ వాక్ కూడా దుబాయ్ ప్రేమ్ లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. 45 నిమిషాల పాటు ఈ బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం ఉంటుంది. దీనికి భారతీయ కరెన్సీలో అయితే 2012 రూపాయలు వసూలు చేయనున్నారు.

అయితే ఇది వారాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. స్కైబ్రిడ్జ్ లోని అబ్జర్వేషన్ ఏరియాలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 4 నుంచి దుబాయ్ ఫ్రేమ్ మీద బ్రేక్ ఫాస్ట్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ సమయంలో ఉదయం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు గా నిర్ణయించారు. దుబాయ్ ఫ్రేమ్ అందాలను, సూర్యోదాయన్ని ఆస్వాదిస్తూ బ్రేక్ ఫాస్ట్ చేయాలనుకునే వారు దుబాయ్ ఫ్రేమ్ వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. కరోనా కారణంగా అతిథులు అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it