షాపింగ్ ఫెస్టివల్ కు రెడీ అవుతున్న దుబాయ్

షాపింగ్ ఫెస్టివల్ కు రెడీ అవుతున్న దుబాయ్

దుబాయ్ ప్రతి ఏటా నిర్వహించే షాపింగ్ ఫెస్టివల్ కు రెడీ అవుతోంది. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (డీఎస్ఎఫ్) ఈ ఏడాది డిసెంబర్ 26న ప్రారంభం అయి 2021 జనవరి 24న ముగియనుంది. కోవిడ్ ఉన్నా కూడా దుబాయ్ మాత్రం ఈ షాపింగ్ ఫెస్టివల్ విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. అంతే కాదు..ఇప్పటివరకూ ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో దుబాయ్ ఒక్కటే ముందుగా పర్యాటకులను తమ దేశంలోకి అనుతిస్తోంది. అయితే ప్రయాణానికి కొన్ని గంటల ముందు విధిగా కరోనా టెస్ట్ చేయించుకుని నెగిటివ్ ఉన్న వారిని మాత్రమే దేశంలోకి అనుమతిస్తున్నారు. గత కొంత కాలంగా దుబాయ్ వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. భారత్ నుంచి కూడా యూఏఈకి విమాన సర్వీసులు నడుస్తున్నాయి.

అంతర్జాతీయ పర్యాటకులకు ఇది చాలా అనువైన సమయం. పలు దేశాల్లో హాలిడేస్ కూడా ఉండటంతో ప్రతి ఏటా దుబాయ్ ఈ సమయంలోనే భారీ ఎత్తున ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తుంది. ఇప్పటికే పలు ట్రావెల్ ఏజెన్సీలు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ప్యాకేజీ టూర్స్ ఆఫర్ చేస్తున్నాయి. వీటి కనీస ధర 36 వేల రూపాయల నుంచి గరిష్టంగా 65 వేల రూపాయాల వరకూ ఉంటోంది. అయితే ఆయా పర్యాటకులు కోరుకునే బస సదుపాయాలు, దుబాయ్ లో సందర్శించాల్సిన ప్రాంతాలను బట్టి ఈ ప్యాకేజీల ధర మారుతుంది. ఎకానమీలో అయితే గరిష్టంగా 50 వేల రూపాయల వ్యయంతో దుబాయ్ టూర్ పూర్తి చేసుకోవచ్చు. అయితే కరోనా కారణంగా ఈ సారి దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ జోష్ ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.

Similar Posts

Recent Posts

International

Share it