దుబాయ్ నుంచి సియాటెల్ కు ఎమిరేట్స్ సర్వీసులు

దుబాయ్ నుంచి సియాటెల్ కు ఎమిరేట్స్ సర్వీసులు

ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ తన సర్వీసులు అన్నింటిని ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తోంది. తాజాగా అమెరికాలోని అత్యంత కీలక నగరం అయిన సియాటెల్ కు ఎమిరేట్స్ దుబాయ్ నుంచి సర్వీసులు ప్రారంభించింది.వారంలో నాలుగు నాన్ స్టాప్ సర్వీసులు నడుపుతున్నట్లు ఎమిరేట్స్ వెల్లడించింది. అదే సమయంలో మార్చి 2 నుంచి డల్లాస్, శాన్ ప్రాన్సిస్కో కు కూడా సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. దుబాయ్ నుంచి మొత్తం అమెరికాలోని తొమ్మిది ప్రాంతాలకు ఎమిరేట్స్ సేవలను ప్రారంభించింది.

Similar Posts

Share it