ఆకాశంలో మరిన్ని హంగులు

ఆకాశంలో మరిన్ని హంగులు

ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ఆకాశంలో మరిన్ని హంగులు అందించటానికి రెడీ అయింది. సహజంగానే ఏ380 విమాన ప్రయాణం అంటే విలాసానికి కేరాఫ్ అడ్రస్ లాంటిది. అలాంటి ఈ ఏ380 విమానంలో ఇప్పుడు ఎమిరేట్స్ ప్రీమియం ఎకానమీ పేరుతో సేవలను కొత్త లెవల్ కు తీసుకెళుతున్నట్లు ప్రకటించింది. ఎమిరేట్స్ ఫ్లీట్ లోకి ఇప్పుడు కొత్తగా సిగ్నేచర్ ఏ 380 వచ్చి చేరింది.

తమ కొత్త ఏ380లో అన్ని క్యాబిన్లు నూతనత్వాన్ని సంతరించుకుని ఉంటాయని ఎమిరేట్స్ తెలిపింది. ఇతర ఎయిర్ లైన్స్ సేవలను కుదిస్తుంటే తాము మాత్రం ప్రయాణికులకు కొత్త అనుభూతులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. తమ ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాటు చేస్తామని ఎమిరేట్స్ తెలిపింది.

Similar Posts

Recent Posts

International

Share it