ఎమిరేట్స్ ఆసక్తికర ఆఫర్

ఎమిరేట్స్ ఆసక్తికర ఆఫర్

ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ తన ప్రయాణికుల కోసం ఆసక్తికర ఆఫర్ ను తీసుకొచ్చింది. దుబాయ్ కు రిటర్న్ టిక్కెట్స్ బుక్ చేసుకున్న వారికి దుబాయ్ లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫైవ్ స్టార్ హోటల్ అయిన జె డబ్ల్యు మారియట్ మార్కిస్ లో ఒక రోజు ఉచిత స్టే కల్పించనున్నారు. డిసెంబర్ 2 నుంచి 23 వరకూ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి ఈ సౌకర్యం కల్పించనున్నారు. డిసెంబర్ 6 నుంచి ఫిబ్రవరి 28 వరకూ ప్రయాణించే వారికి ఈ సౌకర్యం వర్తిస్తుంది.

అదే ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ టిక్కెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రం అదే హోటల్ లో రెండు రోజుల ఉచిత బస కల్పించనున్నారు. అత్యంత సురక్షితమైన పద్దతులతో దుబాయ్ పర్యాటకులను ఆకర్షిస్తోందని..ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎమిరేట్స్ వెల్లడించింది. ప్రపంచంలోనే ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ కు సురక్షితమైన ఎయిర్ లైన్స్ రేటింగ్ దక్కినట్లు కంపెనీ తెలిపింది.

Similar Posts

Share it