జనవరి నుంచి సౌ పౌలోకు ఎమిరేట్స్ సర్వీసులు

జనవరి  నుంచి సౌ పౌలోకు ఎమిరేట్స్ సర్వీసులు

బ్రెజిల్ లోని ప్రముఖ ఆర్ధిక కేంద్రం సౌ పౌలోకు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ తన సర్వీసులను ప్రారంభించనుంది. అది కూడా అత్యంత విలాసవంతమైన ఎయిర్ బస్ ఏ380 విమానాలతో. ఈ విషయాన్ని ఎమిరేట్స్ తన ఇన్ స్టా ఖాతా ద్వారా వెల్లంచింది. 2021 జనవరి నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దుబాయ్ నుంచి ఈ విమాన సర్వీసులు వారంలో నాలుగు సార్లు నడవనున్నాయి.

జనవరి 9 నుంచి 30 మధ్యలో ఇవి ఉంటాయని తెలిపారు. వచ్చే వేసవి సీజన్ దృష్టిలో పెట్టుకుని పెరిగే ప్రయాణికుల డిమాండ్ కు అనుగుణంగా ఈ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఎమిరేట్స్ తెలిపింది. 2020 మార్చిలో కరోనా కారణంగా సర్వీసులు రద్దు చేసిన తర్వాత మళ్ళీ వీటిని పునరుద్ధరించటం ఇది మొదటిసారి అని తెలిపింది.

Similar Posts

Share it