ఫిబ్రవరి 1 నుంచి సియాటెల్ కు ఎమిరేట్స్ సేవలు

ఫిబ్రవరి 1 నుంచి సియాటెల్ కు ఎమిరేట్స్ సేవలు

ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎమిరేట్స్ ఫిబ్రవరి 1 నుంచి అమెరికాలోని సియాటెల్ కు సర్వీసులు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో దుబాయ్ నుంచి డల్లాస్, శాన్ ప్రాన్సిస్కోలకు విమానాలను మార్చి 2 నుంచి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ కు ఫిబ్రవరి 1 నుంచి అదనపు విమాన సర్వీసులు నడుపుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. సురక్షితంగా, క్రమక్రమంగా తమ విమాన సర్వీసులను తమ నెట్ వర్క్ అంతటికీ విస్తరిస్తున్నట్లు ఎమిరేట్స్ తెలిపింది. ప్రస్తుతం ఆరు ఖండాల్లోని 114 ప్రాంతాలకు ఎమిరేట్స్ సర్వీసులు ప్రారంభించింది.

Similar Posts

Share it