'ఎమిరేట్స్ 'కు ఎయిర్ లైన్ ఆఫ్ ది ఇయర్ 2020 అవార్డు

ఎమిరేట్స్ కు ఎయిర్ లైన్  ఆఫ్ ది ఇయర్ 2020 అవార్డు

ఏవియేషన్ బిజినెస్ అవార్స్ లో భాగంగా ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ 'ఎయిర్ లైన్ ఆఫ్ ది ఇయర్ 2020' అవార్డును దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉన్న అత్యంత కాలంలో కూడా అత్యంత సమర్ధవంతంగా సేవలు అందించినట్లు ఎమిరేట్స్ పేర్కొంది. వినూత్నమార్గాల ద్వారా ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ మరింత కష్టపడతామన్నారు.

ప్రయాణికుల విశ్వాసం పొందటంతోపాటు, వారికి సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఆరోగ్యం, రక్షణ చర్యల విషయంలో అత్యంత ఉన్నత ప్రమాణాలు నెలకొల్పినట్లు తెలిపారు. ఎమిరేట్స్ ప్రెసిడెంట్ గా ఉన్న టిమ్ క్లార్క్ కు 'లైఫ్ టూమ్ అచీవ్ మెంట్ అవార్డు' అందుకున్నారు. విమానయాన రంగానికి ఆయన అందించిన సేవలకు గాను ఈ అవార్డు ఇచ్చినట్లు తెలిపారు.

Similar Posts

Share it