సముద్రంలో విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్

సముద్రంలో విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్

విలాసవంతమైన హోటళ్లు చాలానే ఉంటాయి. కానీ సముద్రం మధ్యలో అది కూడా ఫ్లోటింగ్ హోటల్ అయితే ఎంత వెరైటీగా ఉంటుంది. ఖతార్ లో ఇప్పుడు అలాంటి హోటల్ ఒకటి రాబోతుంది. అంతే కాదు..ఈ హోటల్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటి అంటే తనకు అవసరమైన విద్యుత్ ను ఈ ఫ్లోటింగ్ హోటల్ సొంతంగా ఉత్పత్తి చేయగలదట. నీటిలో తిరుగుతూ విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తుందని ప్రకటించారు. ఏకంగా 152 రూమ్ లతో ఈ హోటల్ రెడీ కానుంది. పర్యావరణహితంగా ఈ ఫ్లోటింగ్ హోటల్ ను హయ్ రీ అటక్ ఆర్కిటెక్చరల్ డిజైన్ స్టూడియో నిర్మించనుంది. 35 వేల చదరపు మీటర్ల ప్రాంతంలో ఈ హోటల్ నిర్మాణం జరగనుంది. ప్రతి 24 గంటలకు ఓ సారి ఈ హోటల్ ఓ సారి పూర్తిగా తిరుగుతుంది.

ఇతర స్టార్ హోటళ్ళలో ఉన్న తరహాలోనే ఇందులోనూ రూఫ్ టాప్ బార్స్, స్పా, జిమ్నాజియమ్స్, మినీ గోల్ఫ్ క్లబ్ వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి. సముద్రంలో మధ్యలో ఉంటుంది ఈ హోటల్. తాజాగా నిర్మాణ సంస్థ ఈ డిజైన్ తోపాటు హోటల్ వివరాలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 2020 మార్చిలో ప్రారంభం అయిన ఈ నిర్మాణ పనులు 2025 సంవత్సరానికి పూర్తి అవుతుందని అంచనా. హోటల్ ను వాస్తవానికి ఖతార్ లో ప్లాన్ చేసినా దీనిలో ఉన్న కదిలే ఫీచర్స్ ఆధారంగా ఎక్కడికైనా మార్చుకోవచ్చన్నారు. నీటిలో వచ్చే అలలకు అనుగుణంగా ఇది సర్దుకోగలదని తెలిపారు.

Similar Posts

Recent Posts

International

Share it