జనవరి 8 నుంచి యూకెకు విమానాలు

జనవరి 8 నుంచి యూకెకు విమానాలు

భారత్-యూకెల మధ్య విమాన సర్వీసుల ప్రారంభానికి రంగం సిద్ధం అయింది. జనవరి 8 నుంచి ఇవి ప్రారంభం కాబోతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. జనవరి 8 నుంచి జనవరి 23 వరకూ కేవలం 15 విమాన సర్వీసులను మాత్రమే నడపనున్నారు. అది కూడా హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, ముంబయ్ ల నుంచి మాత్రమే అని తెలిపారు.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను డీజీసీఏ ప్రకటిస్తుందని తెలిపారు. యూకె లో కొత్తగా వెలుగుచూసిన కరోనా స్ట్రెయిన్ తో భారత్ తోపాటు పలు దేశాలు విమానాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఓ వైపు కొత్త వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నా కూడా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Similar Posts

Recent Posts

International

Share it