ఎమిరేట్స్ లో దుబాయ్ ..ఫైవ్ స్టార్ హోటల్ లో ఫ్రీ బస

ఎమిరేట్స్ లో దుబాయ్ ..ఫైవ్ స్టార్ హోటల్ లో ఫ్రీ బస

ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ మరోసారి కొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ కు టికెట్ బుక్ చేసుకుంటే ఉచితంగా ఫైవ్ స్టార్ హోటల్ లో బస సౌకర్యం కల్పించనుంది. మార్చి 8 నుంచి మార్చి 28 వరకూ టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాదు..సరళమైన బుకింగ్ వెసులుబాట్లు కూడా కల్పిస్తున్నట్లు పేర్కొంది. దీంతోపాటు కోవిడ్ 19 సహా బహుళ రిస్క్ లతో కూడిన బీమా సౌకర్యం కూడా కల్పించనుంది. ఈ ఆఫర్ టైమ్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు మార్చి 15 నుంచి జూన్ 2021 మధ్య కాలంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఎకానమీ క్లాస్ టిక్కెట్ బుక్ చేసుకున్న వారికి ఒక రోజు దుబాయ్ లోని జె డబ్ల్యూ మారియట్ మార్కిస్ హోటల్ లో ఒక రోజు కాంప్లిమెంటరీ బస కల్పిస్తారు.

ఇది ప్రపంచంలోని అతి ఎత్తైన ఫైవ్ స్టార్ హోటళ్ళలో ఒకటి. బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు ఇదే కాలంలో టిక్కెట్లు బుక్ చేసుకుంటే వారికి మాత్రం రెండు రోజుల బస కల్పించనున్నారు. ప్రమోషనల్ రిటర్న్ ఫేర్స్ ఎకానమీ క్లాస్ లో అయితే 17982 రూపాయలు, బిజినెస్ క్లాస్ అయితే 68,996 రూపాయలు, ఫస్ట్ క్లాస్ అయితే 1,92,555 రూపాయలుగా ఎమిరేట్స్ తన ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ కింద ప్రయాణికులకకు పది కేజీల అదనపు బ్యాగేజ్ వసతి కూడా కల్పిస్తున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it