జీఎంఆర్ విమానాశ్రయాలకు ఏసీఐ అవార్డులు

జీఎంఆర్  విమానాశ్రయాలకు ఏసీఐ అవార్డులు

జీఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్న న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజిఐఎ), హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ)లకు ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) వరల్డ్ "వాయిస్ ఆఫ్ కస్టమర్" గుర్తింపు లభించింది. 2020లో కోవిడ్-19 సమయంలో ప్రయాణీకుల అభిప్రాయాలను సేకరించి, వారి అవసరాలను అర్థం చేసుకుని, దానికి తగిన చర్యలను తీసుకుంటూ చేసిన నిరంతర కృషికి ఈ రెండు విమానాశ్రయాలకూ ఈ గుర్తింపు లభించింది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకోవడం చాలా అవసరం. విమాన ప్రయాణంపై ప్రయాణీకుల విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో పోషించిన చురుకైన పాత్రకు గాను హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలకు ఈ గుర్తింపు లభించింది. కోవిడ్ -19 ప్రపంచంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేయగా, అందులో ఎక్కువగా ప్రభావితమైనది విమానయాన రంగం. విమాన ప్రయాణంపై ప్రయాణీకుల నమ్మకాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో, పరిస్థితులకు అనుగుణంగా సురక్షితమైన ప్రయాణానికి మెరుగైన చర్యలను అమలు చేయడానికి జీఎంఆర్ హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలు నిరంతరం ప్రయాణీకుల అభిప్రాయం తెలుసుకుంటూ అన్ని రకాల కృషి చేశాయి.

హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలు రెండూ ఆయా విమానాశ్రయాలలో కాంటాక్ట్‌ లెస్ ఎలివేటర్లు, కాంటాక్ట్‌ లెస్ ఇన్ఫర్మేషన్ డెస్క్‌ లు, డిజిటల్ లావాదేవీలు, షాపింగ్ కోసం యాప్ బేస్డ్ టెక్నాలజీలు, ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి హోయి యాప్, ప్యాసింజర్ బ్యాగేజ్ యొక్క యువీ శానిటైజేషన్, క్యాబ్‌ల పరిశుభ్రత, గాలి శుభ్రతను పెంచడానికి హెపా ఫిల్టర్లు వంటి అనేక చర్యలు చేపట్టారు. అనేక సంవత్సరాలుగా దేశీయ ప్రయాణికులందరికీ పేపర్‌లెస్ ఇ-బోర్డింగ్ సదుపాయం ఉన్న దేశంలోని ఏకైక విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయం, విమానాశ్రయ కార్యకలాపాల పున:ప్రారంభం అనంతరం దానిని అంతర్జాతీయ ప్రయాణీకులకూ విస్తరిస్తోంది.

Similar Posts

Recent Posts

International

Share it