డిసెంబర్ లో గోవాకు 4.67 లక్షల విమాన ప్రయాణికులు

డిసెంబర్ లో గోవాకు 4.67 లక్షల విమాన ప్రయాణికులు

గత ఏడాది ఒక్క డిసెంబర్ నెలలోనే గోవాకు ఏకంగా 4.67 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. గత కొన్ని నెలలుగా గోవాకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఎయిర్ పోర్ట్స్ ఆథారిటి ఆఫ్ ఇండియా (ఏఏఐ) గణాంకాల ప్రకారం 2020 జులైలో విమానాల ద్వారా గోవాకు 19,730 మంది ప్రయాణించారు. ఈ సంఖ్య ఆగస్టులో 32, 954కు, సెప్టెంబర్ లో 76,000, అక్టోబర్ లో 1,68,242, నవంబర్ లో 2,94,812కి పెరిగారు. 2020 డిసెంబర్ లో ఇది ఏకంగా 4, 67, 957కి చేరింది.

కోవిడ్ సమస్య ఉన్నా కూడా గోవా విమానాశ్రయం దేశ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోందని ఏఏఐ వెల్లడించింది. అందరూ కలసి సంయుక్తంగా కరోనాను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఏటా అక్టోబర్ నెల నుంచి గోవాకు పర్యాటక సీజన్ ప్రారంభం అవుతుంది. కరోనా భయాలు ఉన్నా కూడా డిసెంబర్ లోనే రికార్డు స్థాయిలో ప్రయాణికుల సంఖ్య పెరగటం విశేషం.

Similar Posts

Recent Posts

International

Share it