హైదరాబాద్ నుంచి నేరుగా మాల్దీవులకు విమాన సర్వీసులు

హైదరాబాద్ నుంచి నేరుగా మాల్దీవులకు విమాన సర్వీసులు

మాల్దీవులు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రాంతం. ముఖ్యంగా భారత్ లోని సెలబ్రిటీలు అంతా కరోనా సమయంలో ఈ ప్రాంతంలోనే బస చేశారు. ప్రకృతిని ఆస్వాదించారు. ఈ కీలక పర్యాటక ప్రాంతానికి ఇప్పుడు హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 11 నుంచి గో ఎయిర్ విమానయాన సంస్థ మాల్దీవులకు డైరక్ట విమాన సర్వీసులను ప్రారంభిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వారంలో నాలుగు రోజుల పాటు సర్వీసు అందుబాటులో ఉండనుంది.

సోమ, మంగళ, గురు, ఆదివారాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. గోఎయిర్ సర్వీసుతో పర్యాటకులు ఇక నుంచి నేరుగా మాల్దీవుల్లోని మాలేలో ల్యాండ్ అవ్వొచ్చు. ఎయిర్ బస్ ఏ 320 ద్వారా ఈ సర్వీసులు అందించనుంది. ఇప్పటివరకూ మాల్దీవుల వెళ్ళాలనుకునే ప్రయాణికులు చెన్నయ్ లేదా ముంబయ్ కు వెళ్లాల్సి వస్తోంది. హైదరాబాద్ నుంచి నేరుగా మాల్దీవులకు విమాన సర్వీసులు ప్రారంభం కావటం ముఖ్యంగా పర్యాటకులకు సానుకూల అంశంగానే చెప్పొచ్చు. ఒక వైపు టిక్కెట్ ధరను 7811 రూపాయలుగా నిర్ణయించినట్లు గో ఎయిర్ తన ట్వీట్ ద్వారా తెలిపింది.

Similar Posts

Recent Posts

International

Share it