ప్రపంచంలోనే ఎత్తైన పది నగరాలు ఇవే!

ప్రపంచంలోనే ఎత్తైన పది నగరాలు ఇవే!

టాప్ లో ఉండటం చాలా మందికి ఇష్టం. ఉన్నత శిఖరాలకు చేరేందుకు చెమటోడ్చుతారు కూడా.. కానీ విచిత్రంగా ఎలాంటి ప్రయత్నాలు లేకుండానే ప్రపంచంలోనే టాప్ లో ఉండటం అంటే..ఆ కిక్కే వేరు. అలాంటి నగరాల కథే ఇది. ప్రపంచంలోనే పది ఎత్తైన నగరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఓ లుక్కేయండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉండే వాటిలో మొదటి స్థానం పెరులోని లా రిన్ కొనడాకు దక్కుతుంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 5100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఉండే జనాభా 50 వేల మంది మాత్రమే. గోల్డ్ మైనింగ్ ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి. ఇక ప్రపంచంలోని రెండవ ఎత్తైన ప్రాంతాల్లో ఎల్ అల్టో ఉంది. ఇది బొలివియా దేశంలోని నగరం. ఈ నగరం ఎత్తు 4150 మీటర్లు. దక్షిణ అమెరికాలో ఎత్తైన అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ప్రాంతం కూడా ఇదే.

పొటోసి అనే నగరం కూడా బొలివియాలోనే ఉంది. దీని ఎత్తు 4090 మీటర్లు. ఇది యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రాంతం. టిబెట్ లోని షిగెట్సి ప్రాంతం ప్రపంచంలోనే నాల్గవ ఎత్తైన నగరం. ఇది టిబెట్ లో ఉంది. పెరులోని జులేషియా ప్రపంచంలోని ఐదవ ఎత్తైన ప్రాంతం. ఇది 3800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అత్యంత పాపులర్ జులేషియా కార్నివాల్ కు ఈ నగరం ఆతిథ్యం ఇస్తుంది. పెరులోనే పునో నగరం కూడా టాప్ టెన్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ నగరం 3800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. శతాబ్దాలకు చెందిన చారిత్రక స్థానిక డ్యాన్స్ లకు ఈ ప్రాంతం ప్రత్యేకం. బొలివియాలోనే ఓరూరో నగరం ఏడవ స్థానంలో ఉంది. దీని ఎత్తు 3709 మీటర్లు.

టిబెట్ లోని లాహసా ప్రాంతం 3650 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది టిబెట్ రాజధాని నగరం కూడా. ఆథ్మాత్మిక, రాజకీయ ప్రాంతంగా కూడా దీనికి గుర్తింపు ఉంది. బొలివియాలోనే మరో నగరం లా పాజ్ ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. 3640 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇది. ఇథియోపియాలోని అడిస్ అబాబా నగరం ప్రపంచంలోని ఎత్తైన పది నగరాల్లో చివరి స్థానంలో ఉంది.. ఈ నగరం ఎత్తు 2355 మీటర్లు. ఇది ఇథియోపియా రాజధాని నగరం. ఇలా ఒక్కో నగరానికి ఒక్కో ప్రత్యేకత ఉంది ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతాల్లో ఇవిఉన్నాయి. కొంత మంది పర్యాటకులు అయితే టార్గెట్ పెట్టుకుని మరీ ఇలాంటి ప్రాంతాలను సందర్శించేందుకు ప్రయత్నిస్తుంటారు.

Similar Posts

Recent Posts

International

Share it