బ్రిటన్ కు విమానాలు రద్దు చేసిన భారత్

బ్రిటన్ కు విమానాలు రద్దు చేసిన భారత్

భారత సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో కొత్త వైరస్ వేగంగా విస్తరిస్తున్నందున ప్రభుత్వం డిసెంబర్ 31 వరకూ బ్రిటన్ కు విమానాలు నిలిపివేసింది. అక్కడ నుంచి విమానాలు ఇక్కడకు రావు. ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లవు. మంగళవారం అర్ధరాత్రి నుంచే ఇది అమల్లోకి రానుంది. అయితే ఈ లోపు బ్రిటన్ నుంచి భారత్ కు వచ్చే వారు ఖచ్చితగా ఆర్ టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. అత్యవసరంగా సోమవారం నాడు సమావేశం అయిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా దుబాయ్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఇఫ్పటికే పలు దేశాలు బ్రిటన్ కు సర్వీసులు నిలిపివేశాయి. భారత్ కూడా వేగంగా స్పందించింది. లేదంటే దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో లేనిపోని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓ వైపు వైద్య నిపుణులు ఈ వైరస్ అంత ప్రమాదకరం కాదని చెబుతున్నా కూడా పలు దేశాలు ఏ మాత్రం రిస్క్ తీసుకోవటానికి సిద్ధంగా లేవు.

Similar Posts

Recent Posts

International

Share it