భారత్ లో తొలి గ్లాస్ స్కైవాక్

భారత్ లో తొలి గ్లాస్ స్కైవాక్

భారతీయ పర్యాటకులు గ్లాస్ స్కైవాక్ కోసం ఇక విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి సౌకర్యం ప్రస్తుతం దేశంలోనే అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకూ విదేశాల్లోనే గ్లాస్ స్కైవాక్ లు సాధ్యం అయ్యేవి. అమెరికా, దుబాయ్ తదితర దేశాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. గ్లాస్ స్కైవాక్ చేయలంటే చాలా ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే కొన్ని చోట్ల అలా కాళ్లు పెట్టి ముందుకు వెళుతుంటే గ్లాస్ పగులుతున్న శబ్దాలు రావటంతోపాటు పగుళ్ళు కూడా కన్పిస్తాయి. అయినా సరే ఏమీకాదు. కాకపోతే ఏమీకాదన్న ధైర్యం మనకుండాలి ముందు. అత్యద్భుతమైన ప్రాంతంలో ఈ దేశీ గ్లాస్ స్కైవాక్ ను సిక్కింలోని పెల్లింగ్ లో ఏర్పాటు చేశారు. ఈ గ్లాస్ స్కైవాక్ హిమాలయాల దగ్గర్లోని 137 అడుగుల ఎత్తైన విగ్రహానికి దగ్గర్లో ఉంటుంది.

సిక్కింలో ఏర్పాటు చేసిన ఈ స్కైవాక్ దేశంలోనే మొదటిది. పర్యాటకులకు మంచి అనుభూతి ఇచ్చేలా దీన్ని నిర్మించారు. అనారోగ్య సమస్యలు ఉన్న వారిని మాత్రం దీనిపైకి అనుమతించరు. ఎందుకంటే కొన్ని వందల అడుగుల ఎత్తు నుంచి కిందకు చూస్తే వారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండటమే. ఈ స్కైవాక్ నుంచి పర్యాటకులు దగ్గర్లోని తీస్థా, రంగిట్ నదులను కూడా చూడొచ్చు. ప్రతి రోజూ ఈ స్కైవాక్ ను ఉదయం 8 గంటలకు ఓపెన్ చేసి సాయంత్రం 5 గంటలకు మూసివేస్తారు. టిక్కెట్ ధర కేవలం 50 రూపాయలు మాత్రమే.

Similar Posts

Recent Posts

International

Share it