ఇండిగో 15వ వార్షికోత్స‌వ సేల్..915 రూపాయ‌ల‌కే టిక్కెట్

ఇండిగో 15వ వార్షికోత్స‌వ సేల్..915 రూపాయ‌ల‌కే టిక్కెట్

దేశీయ ఎయిర్ లైన్స్ ఇండిగో మ‌రోసారి ఆఫ‌ర్ తో ముందుకొచ్చింది. త‌న 15 వార్షికోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని 915 రూపాయ‌ల‌కు విమాన టిక్కెట్లు విక్ర‌యిస్తోంది. ఈ విక్రయం ఆగ‌స్టు 4 నుంచి 6వ తేదీ వ‌ర‌కూ కొన‌సాగన‌నున్నాయి. వార్షికోత్స‌వ ఆఫ‌ర్ కింద బుక్ చేసుకున్న టిక్కెట్ల ప్ర‌యాణ స‌మ‌యం 2021 సెప్టెంబ‌ర్ 1 నుంచి 2022 మార్చి 26 వ‌ర‌కూ ఉంటుంద‌ని వెల్ల‌డించింది. బ్యాగ్ లు స‌ర్దుకుని అత్యుత్తమ ధ‌ర‌ల‌తో టిక్కెట్లు పొంది న‌చ్చిన ప్ర‌దేశాలు సంద‌ర్శించ‌టానికి రెడీగా ఉండండి అంటూ ఇండిగో సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌యాణికుల‌కు ఆఫ‌ర్ ఇచ్చింది.

జన్ లో దేశీయ విమాన‌యాన రంగం కాస్త పుంజుకుంది. గ‌తంతో పోలిస్తే విమాన ప్ర‌యాణికుల సంఖ్య క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతోంది. అయితే మ‌ళ్ళీ కేసులు పెరుగుతున్న వార్త‌లు వ‌స్తున్న వేళ థ‌ర్డ్ వేవ్ ఎలా ఉండ‌బోతుందో అనే ఆందోళ‌న అంద‌రిలో నెల‌కొంది. అయిత వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ అనుకున్నంత స్థాయిలో కాక‌పోయినా కొంత వేగంగా పుంజుకోవ‌టం కొంత‌లో కొంత ఊర‌టగా భావిస్తున్నారు. ఎయిర్ లైన్స్ కూడా కొద్ది రోజుల క్రితం రెండు డోసులు పూర్తి అయిన వారికి టిక్కెట్ ద‌ర‌ల్లో రాయితీలు కూడా ప్ర‌క‌టించాయి.

Similar Posts

Recent Posts

International

Share it