ఇండిగో రిఫండ్స్ జనవరి 31లోపు

ఇండిగో రిఫండ్స్ జనవరి 31లోపు

దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగో 2021 జనవరి 31లోగా ప్రయాణికులు అందరికీ రద్దు అయిన టిక్కెట్లకు సంబంధించి రిఫండ్ చెల్లింపులను పూర్తి చేయనున్నట్లు తెలిపింది. కరోనా కారణంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ క్రెడిట్ షెల్ లో ఉన్న వంద శాతం మొత్తాలను చెల్లించేందుకు రెడీ అయినట్లు వెల్లడించారు. రిఫండ్ కింద ఇండిగో ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించనుంది. ఇది ప్రయాణికులకు చెల్లించాల్సిన మొత్తంలో 90 శాతంగా తెలిపారు.

కోవిడ్ లాక్ డౌన్ కారణంగా మార్చి 25 నుంచి విమాన సర్వీసులను నిలిపివేశారు. అయితే పలు ఎయిర్ లైన్స్ రద్దు అయిన ఈ టిక్కెట్ల డబ్బుతో ప్రయాణికులు తమ తదుపరి ప్రయాణాల సమయంలో టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తామని ప్రకటించాయి. అయితే ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరటంతో 2021 మార్చిలోగా ఎయిర్ లైన్స్ అన్నీ రద్దు అయిన టిక్కెట్ల మొత్తాలను రిఫండ్ చేయాలని ఆదేశించింది. దానికి అనుగుణంగా ఎయిర్ లైన్స్ రిఫండ్ పై నిర్ణయం తీసుకున్నాయి.

Similar Posts

Recent Posts

International

Share it