ఆఫర్ల రేసులోకి ఇండిగో..877 రూపాయలకే విమాన టిక్కెట్లు

ఆఫర్ల రేసులోకి ఇండిగో..877 రూపాయలకే విమాన టిక్కెట్లు

దేశీయ విమానయాన సంస్థల మధ్య మళ్ళీ ఆఫర్ల యుద్ధం మొదలైంది. తొలుత స్పైస్ జెట్ ఇందుకు తెరతీయగా..ఇప్పుడు మరో ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా రంగంలోకి దిగింది. స్పైస్ జెట్ ముందు దేశీయ సెక్టార్ లో 899 రూపాయలకే టిక్కెట్లు ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఇండిగో మరింత చౌకగా 877 రూపాయలకే టిక్కెట్లు ఇస్తున్నట్లు తెలిపింది.

ఇండిగో సేల్ జనవరి 13న ప్రారంభం అయి..17న ముగియనుంది. ఈ ఆఫర్ టైమ్ లో బుక్ చేసుకున్న టిక్కెట్లపై 2021 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30లోపు ఎప్పుడైనా ప్రయాణించవచ్చని ఇండిగో తెలిపింది. ఇండిగో సేల్ లో టిక్కెట్లు కొనుగోలు చేసి ఆకాశంలో విహరించండి అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది ఇండిగో.

Similar Posts

Share it