విమానాశ్రయంలో 'చెక్ ఇన్' అయితే వంద కట్టాల్సిందే

విమానాశ్రయంలో చెక్ ఇన్ అయితే వంద కట్టాల్సిందే

దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగో సంచలన నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయంలో చెక్ ఇన్ కావాలంటే ప్రతి ప్రయాణికుడు విధిగా వంద రూపాయలు సర్వీసు ఛార్జ్ కట్టాల్సి ఉంటుందని ప్రకటించింది. అక్టోబర్ 17 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దేశంలో చెక్ ఇన్ కు ఛార్జీ వసూలు చేస్తున్న ఎయిర్ లైన్స్ గా ఇండిగో రికార్డుల్లోకి ఎక్కింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వెబ్ చెక్ ఇన్ ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇండిగో వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా వెబ్ చెక్ ఇన్ కావాలని ప్రయాణికులకు సూచించారు. కరోనా వైరస్ దృష్ట్యా 'టచ్ పాయింట్స్' ను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అందునా వచ్చేది పండగల సీజన్ కావటంతో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఇండిగో చెక్ ఇన్ కు వంద రూపాయల ఛార్జీ వసూలు నిర్ణయం తీసుకోవటం విశేషం.

Similar Posts

Recent Posts

International

Share it