అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం డిసెంబర్ 31 వరకూ

అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం డిసెంబర్ 31 వరకూ

భారత్ మరోసారి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని పొడిగించింది. ఈ మేరకు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా ఇలా ప్రతి నెలా నిషేధాన్ని పొడిగించుకుంటూ పోతున్నారు. అయితే ఇఫ్పటికే పలు దేశాలతో కుదుర్చుకున్న ఎయిర్ బబుల్ ఒప్పందాల ప్రకారం అంతర్జాతీయ రూట్లలో విమానాలు నడుస్తున్నాయి. దీంతో ఎంపిక చేసిన రూట్లలో నడిచే విమానాలతోపాటు..అంతర్జాతీయ కార్గో సర్వీసులకు మాత్రం ఈ నిషేధం వర్తించదని తన ప్రకటనలో డీజీసీఏ వెల్లడించింది.

అంతర్జాతీయంగా పలు దేశాల్లో కరోనా ఉధృతి ఇంకా పెరుగుతున్నందున అసలు అంతర్జాతీయ విమాన సర్వీసులు సాధారణ స్థాయిలో ఎప్పటి నుంచి నడుస్తాయో తెలియని పరిస్థితి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తప్ప..ఇది సాధ్యం అయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ డిసెంబర్ 11 తర్వాత వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ రవాణా వ్యవస్థ తిరిగి గాడిన పడాలంటే సమర్ధవంతమైన వ్యాక్సిన్ రావటం ఎంతో కీలకం అని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it