అంతర్జాతీయ విమాన సర్వీసులపై మళ్ళీ నిషేధం

అంతర్జాతీయ విమాన సర్వీసులపై మళ్ళీ నిషేధం

భారత్ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ఈ పొడిగింపు ఫిబ్రవరి 28 వరకూ అమల్లో ఉండనుంది. ఈ మేరకు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జాయింట్ డైరక్టర్ సునీల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అయితే దేశం నుంచి ఇప్పటికే అనుమతించిన అంతర్జాతీయ వాణిజ్య విమానాలు మాత్రం కొనసాగనున్నాయి. అంతర్జాతీయ కార్గో విమానాలకు, ప్రత్యేకంగా అనుమతించిన ప్రయాణికుల విమానాలకు ఈ నిషేధం వర్తించదు. అమెరికా, బ్రిటన్ తోపాటు పలు దేశాల్లో ఇంకా కరోనా ఉదృతి తీవ్రంగా ఉండటంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Similar Posts

Share it