లేహ్ -జమ్మూ మార్గంలో విమాన సర్వీసులు ప్రారంభం

లేహ్ -జమ్మూ మార్గంలో విమాన సర్వీసులు ప్రారంభం

పర్యాటకులకు స్వర్గథామం జమ్మూకాశ్మీర్ ప్రాంతం. గుడ్ న్యూస్ ఏంటి అంటే లేహ్ జమ్మూ మధ్య విమాన సర్వీసులు పునరుద్ధరించారు. కరోనాతో అన్ని చోట్ల ఆగినట్లే ఈ ప్రాంతానికి కూడా విమాన సర్వీసులు ఇటీవల వరకూ ఆగిపోయాయి. ఇప్పుడు లద్దాఖ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ల మధ్య విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అయితే ఆదివారంతోపాటు బుధవారాలు, శుక్రవారాలు మాత్రమే ఈ సేవలు నడుస్తున్నాయి.

లద్ధాఖ్ అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (ఎల్ ఏహెచ్ డీసీ) వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శీతాకాలంలో లేహ్ నుంచి మనాలీ వెళ్ళే మార్గంతోపాటు శ్రీనగర్ మార్గం కూడా మంచుతో మూతపడుతుంది. దీంతో ప్రజలు ఒక్క విమాన మార్గం ద్వారానే ఆయా ప్రాంతాలకు చేరుకొనే అవకాశం ఉంటుంది.

Similar Posts

Share it