లుఫ్తాన్సా ఎకానమీ క్లాస్ లో స్లీపర్ రో

లుఫ్తాన్సా ఎకానమీ క్లాస్ లో స్లీపర్ రో

డబ్బు చెల్లించాలే కానీ విమానాల్లో ఎన్నో విలాసవంతమైన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఏకంగా ఆకాశంలో 'అపార్ట్ మెంట్' కాన్సెప్ట్ ను కూడా కొన్ని ప్రీమియం విమానయాన సంస్థలు తీసుకొచ్చాయి. కాకపోతే ఇది అంతా కోవిడ్ కు ముందు కథ. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సంస్థలు నానా కష్టాలు పడుతున్నాయి. ఈ తరుణంలో లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ ఎకానమీ క్లాస్ లో 'స్లీపర్ రో' కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చింది.

అయితే దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చేయకుండా ఒకే వరసలో ఉన్న మూడు సీట్లను స్లీపర్ రో కోరుకునే వారికి కేటాయిస్తోంది. జర్మనీకి చెందిన ఈ లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ పలు మార్గాల్లో ఈ మోడల్ ను అనుసరిస్తోంది. విమానాశ్రయంలో కూడా అప్పటికప్పుడు తమ సీట్లను అప్ గ్రేడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈస్లీపర్ రో టిక్కెట్ తీసుకున్న వారికి దిండు, దుప్పటి కూడా అందిస్తోంది ఎయిర్ లైన్స్. టిక్కెట్ వాస్తవ ధరకు 260 డాలర్లను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it