ముంబ‌య్-ఖాట్మండు విమాన స‌ర్వీసుల పున‌రుద్ధ‌ర‌ణ‌

ముంబ‌య్-ఖాట్మండు విమాన స‌ర్వీసుల పున‌రుద్ధ‌ర‌ణ‌

ఈ విమాన మార్గం ఎంతో పాపుల‌ర్. క‌రోనా ముందు ఈ రూట్ లో ప‌ర్యాట‌కులు భారీ ఎత్తున రాక‌పోక‌లు సాగించేవారు. సుదీర్ఘ విరామం అనంత‌రం నేపాల్ ఎయిర్ లైన్స్ కార్పొరేష‌న్ తిరిగి ముంబ‌య్-ఖాట్మండు విమాన స‌ర్వీసులను ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. దీనికి ముహుర్తం మార్చి 27గా నిర్ణ‌యించారు. దేశం నుంచి అంత‌ర్జాతీయ వాణిజ్య విమాన స‌ర్వీసుల‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. వారంలో మూడు రోజుల పాటు ఈ స‌ర్వీసుల‌ను ఆప‌రేట్ చేయ‌నున్నారు.

ఇవి ఆదివారం, బుధ‌వారం, శుక్ర‌వారాలు ఉంటాయ‌ని నేపాల్ ఎయిర్ లైన్స్ వెల్ల‌డించింది. ఈ సందర్భంగా ప‌లు ఆక‌ర్ష‌ణీయ ఆఫ‌ర్ల‌తో కూడా ఎయిర్ లైన్స్ ముందుకొచ్చింది. కీల‌క‌మైన ఈ రూట్ లో అతి త్వ‌ర‌లోనే సాధార‌ణ ప‌రిస్థితులు వ‌స్తాయ‌ని భావిస్తున్నారు. త‌మ స‌ర్వీసు పూర్తి స్థాయిలో ఆప‌రేట్ చేసే స్థితికి చేరుకుంటుంద‌ని నేపాల్ ఎయిర్ లైన్స్ ఆశాభావం వ్య‌క్తం చేస్తోంది. నేపాల్ లో సుంద‌ర దృశ్యాల‌తోపాటు ఎన్నో చారిత్ర‌క ప్రాంతాలు ఉండ‌టంతో ప‌ర్యాట‌కులు భారీ ఎత్తున దేశాన్ని సంద‌ర్శిస్తుంటారు.

Similar Posts

Recent Posts

International

Share it