సాగర్-శ్రీశైలం క్రూయిజ్ సర్వీసులు నవంబర్ 14 నుంచి

సాగర్-శ్రీశైలం క్రూయిజ్ సర్వీసులు నవంబర్ 14 నుంచి

తెలంగాణలో పర్యాటక కార్యకలాపాలు ఒక్కొక్కటి ప్రారంభం అవుతున్నాయి. నవంబర్ 14 నుంచి నాగార్జునసాగర్-శ్రీశైలం మధ్య క్రూయిజ్ సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ పర్యటనకు ఆసక్తి చూపే వారిని హైదరాబాద్ నుంచి బస్ లో సాగర్ కు తీసుకెళ్ళి అక్కడ నుంచి క్రూయిజ్ లో శ్రీశైలం తీసుకెళతారు. ఈ పర్యటన ఎంతో ఆహ్లదకరంగా ఉంటుంది. దీనికి గతంలో పర్యాటకుల నుంచి విశేష స్పందన వచ్చింది.

ఈ రెండు రోజుల పర్యటనతో కూడిన ప్యాకేజీకి ఒక్కో పర్యాటకుడు పెద్దలు 3035 రూపాయలు, పిల్లలు 2450 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కరోనా కారణంగా ఇన్ని రోజులు ఈ సర్వీసులను నిలిపివేశారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాల కోసం హైదరాబాద్ లోని ఇన్ఫర్ మేషన్ సెంటర్ ను సంప్రదించాలని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.

Similar Posts

Recent Posts

International

Share it