అంతరిక్షం నుంచి హిమాలయాలు..అద్భుతం

అంతరిక్షం నుంచి హిమాలయాలు..అద్భుతం

హిమాలయ పర్వతాలు. ఓ అద్భుతం. అలాంటి పర్వతాలను అంతరిక్షం నుంచి చూస్తే. అది మామూలుగా అయితే సాధ్యం కాదు. కానీ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) అంతరిక్షం నుంచి తీసిన అద్భుతమైన ఫోటోను షేర్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోను విడుదల చేసింది.

మంచు కప్పుకున్న హిమాలయాలతోపాటు ఈ ఫోటోలో భారత్ లోని న్యూఢిల్లీ నగరంతోపాటు పాకిస్థాన్ చెందిన లాహోర్ కూడా ఉన్నట్లు నాసా వెల్లడించింది. సోలార్ రేడియేషన్ వల్ల వచ్చిన మార్క్ ను కూడా నాసా అందులో ప్రస్తావించింది. నాసా షేర్ చేసిన ఫోటోపై నెటిజన్ల నుంచి విశేప స్పందన వస్తోంది. ఈ ఫోటో అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it