భారత ప్రయాణికులకు ఆ దేశంలో నో ఎంట్రీ

భారత ప్రయాణికులకు ఆ దేశంలో నో ఎంట్రీ

దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులతో భారతీయులకు కొత్త సమస్యలు మొదలు అవుతున్నాయి. కరోనా కేసుల తీవ్రత ఆధారంగా పలు దేశాలు నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ ఇప్పుడు అదే పనిచేసింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరినీ తమ దేశంలోకి అనుమతించబోమని న్యూజిలాండ్ ప్రకటించింది. ఏప్రిల్ 11 నుంచి ఇది అమల్లోకి రానుందని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్ వెల్లడించారు. ఈ తాత్కాలిక నిషేధం తమ దేశ పౌరులకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. అయితే ఈ నిషేధం తాత్కాలికమే.

కేసుల ఉధృతి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే నిషేధాన్ని తొలగిస్తారు. తొలి దశలో మాత్రం రెండు వారాల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. తర్వాత పరిస్థితిని బట్టి పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా కట్టడిలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. న్యూజిలాండ్ సరిహద్దుల్లో పనిచేసే సిబ్బందిలో కొంత మందికి కరోనా పాజిటివ్ అని తేలటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Similar Posts

Recent Posts

International

Share it