గోవాలో రాత్రి కర్ఫ్యూ

గోవాలో రాత్రి కర్ఫ్యూ

అగోండా బీచ్, దక్షిణ గోవా 

దేశంలో పర్యాటక రంగం మరోసారి విలవిలలాడుతోంది. కరోనా రెండవ దశ ఊహించని స్థాయిలో దాడి చేయటంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు పెడుతున్నాయి. దీంతో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తాజాగా దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన గోవాలో రాత్రి కర్ఫ్యూ విధించారు. పది గంటల తర్వాత బయటకు ఎవరూ సంచరించటానికి వీల్లేదు, క్యాసినోలు, బార్లు, రెస్టారెంట్లు కూడా పది గంటల లోపు మూసివేయాల్సిందే. గోవాలో కూడా కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి కర్ఫ్యూ తొలి దశలో ఏప్రిల్ 30 వరకూ అమల్లో ఉండనుంది.

గోవాలో ప్రస్తుతం సుమారు పది వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత కొద్ది నెలలుగా గోవాలో పర్యాటక రంగం గాడిన పడుతూ వస్తోంది. గత ఏడాది చివరిలో కరోనా కేసులు ఒకింత తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులు ఊపిరిపీల్చుకున్నారు. చాలా మంది గోవా బాట పట్టారు. కానీ సడన్ రెండవ దశ విభృబించటంతో మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది. అయితే ఇది ఎప్పటికి గాడినపడుతుందో తెలియని పరిస్థితి.

Similar Posts

Recent Posts

International

Share it