పర్యాటకులకు స్వాగతం పలుకుతున్న నీలగిరీస్ కొండలు

పర్యాటకులకు స్వాగతం పలుకుతున్న నీలగిరీస్ కొండలు

ఎనిమిది నెలల విరామం అనంతరం నీలగిరీస్ కొండలు పర్యాటకులకు తిరిగి స్వాగతం పలుకుతున్నాయి. సుందర ప్రకృతి దృశ్యాలతో ఇవి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు ఒత్తిడి ఓ భాగం అయిపోయింది. అందుకే చాలా మంది వీలు చిక్కినప్పుడల్లా టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. రిలాక్స్ అవటానికి..ప్రకృతిలో సేదతీరాలంటే నీలగిరీస్ కొండలు ఓ అద్భుతమైన ప్రదేశం. తమిళనాడులో 38 జిల్లాల్లో నీలగిరీస్ జిల్లా ఒకటి. విశేషం ఏమిటంటే ఈ కొండలు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, కేరళకు కూడా విస్తరించి ఉంటాయి. వీటిని 'బ్లూ మౌంటెన్స్ 'గా కూడా పిలుస్తారు.

పర్యాటక శాఖ నిర్వహించే ప్రాంతాలతోపాటు..అటవీ శాఖ, స్థానిక ప్రజలు నిర్వహించే అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు పర్యాటకులను అనుమతిస్తున్నారు. కరోనా విషయంలో అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని మరీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు అన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే చాలా వరకూ ఓపెన్ చేశారు. వ్యాక్సిన్ కు సంబంధించి పలు సానుకూల వార్తలు రావటంతో కొత్త సంవత్సరం నుంచి మళ్ళీ పాత రోజులు వచ్చే అవకాశం పై పర్యాటకులు ఆశాభావంతో ఉన్నారు.

Similar Posts

Recent Posts

International

Share it