వ్యాక్సిన్ తీసుకున్నారా...పుకెట్ స్వాగ‌తం ప‌లుకుతోంది

వ్యాక్సిన్ తీసుకున్నారా...పుకెట్ స్వాగ‌తం ప‌లుకుతోంది

పుకెట్. థాయ్ లాండ్ లోని దీవుల కేంద్రం. సుంద‌ర ప్రాంతాల నెల‌వు. క‌రోనా కార‌ణంగా గ‌త కొంత కాలంగా ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తించ‌టం లేదు. ఇప్పుడు మాత్రం స్వాగ‌తం ప‌లుకుతోంది. అయితే రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న వారికి మాత్ర‌మే. అది కూడా భార‌తీయుల‌కు మాత్రం ప్ర‌స్తుతానికి నో ఛాన్స్ అంటోంది. కార‌ణం దేశంలో క‌రోనా కేసులు ఎక్కువ ఉండ‌ట‌మే. జులై1 నుంచి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్త‌యిన వారిని అనుమ‌తించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. వీరికి ఎలాంటి క్వారంటైన్ నిబంధ‌న‌లు కూడా ఉండ‌వు. అయితే ప‌ర్యాట‌కుల సేఫ్టీకి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు టూరిజం అథారిటీ ఆప్ థాయ్ లాండ్ వెల్ల‌డించింది.

భార‌త్ లో ప‌రిస్థితులు త్వ‌ర‌లోనే మెరుగుప‌డ‌తాయ‌ని ఆశిస్తున్నామ‌ని.. అప్పుడే వెంట‌నే భార‌త ప‌ర్యాట‌కుల‌కు అనుమ‌తించే విష‌యంలో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. థాయ్ లాండ్ లోని ప‌లు ప్రాంతాల‌ను కూడా వివిద దేశాల‌కు ద‌శ‌ల వారీగా అనుమ‌తించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ‌గా ప‌ర్యాట‌కంపైనే ఆధార‌ప‌డిన థాయ్ లాండ్ కోవిడ్ 19 కార‌ణంగా భారీగా న‌ష్ట‌పోయింది. ఇత‌ర దేశాల‌తో పోలిస్తే అక్క‌డ క‌రోనాను స‌మ‌ర్ధ‌వంతంగా నియంత్రించారు. అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కుల విష‌యంలో ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it