నలభై వేల అడుగుల ఎత్తులో ఇలా నిద్రపోవచ్చు

నలభై వేల అడుగుల ఎత్తులో ఇలా నిద్రపోవచ్చు

గత దశాబ్ద కాలంలో విమానయాన రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. విలాస ప్రయాణం ఓ రేంజ్ కు చేరింది. ముఖ్యంగా ఏ 380 డబుల్ డెక్కర్ విమానాలు వచ్చాకే ఎన్నో వినూత్న మార్పులు సంతరించుకున్నాయి. ఏకంగా విమానాల్లోనే డబుల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్స్ వంటి కాన్సెప్ట్ సేవలతోపాటు...హాయిగా నిద్రిస్తూ కోరుకున్న ప్రాంతానికి చేరుకునే పలు సేవలను విమానయాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చాయి. ఖతార్ దేశానికి చెందిన ఖతార్ ఎయిర్ వేస్ 'క్యూ సూట్ ' పేరుతో సేవలు అందిస్తోంది.

తాజాగా ఎయిర్ లైన్స్ ఇన్ స్టా గ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేస్తూ నలభై వేల అడుగుల ఎత్తులో ఫ్లాట్ గా ఉన్న బెడ్ పై ఇలా నిద్రపోండి అని క్యాప్షన్ జోడించింది. అయితే ఈ క్యూ సూట్ టిక్కెట్ ధరలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి మరి. క్యూసూట్ లో ప్రయాణికులకు అసమాన్యమైన ఏకాంతత లభించటంతోపాటు..ఎంతో సౌలభ్యంగా ఉంటుందని పేర్కొంది. క్యూ సూట్ బెడ్స్ కు అవార్డు కూడా దక్కింది. ముఖ్యంగా కోరుకున్న విలాసవంతమైన సర్వీసులు ముఖ్యంగా దుబాయ్ తోపాటు యూఏఈ లోని పలు దేశాల నుంచే అందుబాటులో ఉన్నాయి.

Similar Posts

Recent Posts

International

Share it