రాత్రివేళ రైళ్ళలో మొబైల్ ఛార్జింగ్ కు నో!

రాత్రివేళ రైళ్ళలో మొబైల్ ఛార్జింగ్ కు నో!

చాలా మందికి రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్లను ఛార్జింగ్ పెట్టడం అలవాటు. తాము లేచే సమయానికి ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది కాబట్టి తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇలా చేస్తుంటారు. అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదని చాలా నివేదికలు తెలిపాయి. అయితే ఇప్పుడు రైల్వేలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. అదేంటి రాత్రి వేళ్ళలో మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఛార్జింగ్ కు అనుమతించరాదని నిర్ణయించారు. రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ ఛార్జింగ్ పై ఆంక్షలు ఉంటాయి.

ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అసలే వేసవి కాలం..ఈ సమయంలో నిప్పు వేగంగా విస్తరించే అవకాశం ఉండటంతో రైల్వేలు ఈ నిర్ణయానికి వచ్చాయి. తాజాగా జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఛార్జింగ్ పై ఆంక్షలు పెట్టాలని నిర్ణయించారు. పశ్చిమ రైల్వే ఇప్పటికే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తోంది. త్వరలోనే మిగిలిన జోన్లలోనూ ఇది అమల్లోకి రానుందని తెలిపారు. ప్రస్తుతం కరోనా కారణంగా ప్రత్యేక రైళ్ళు మాత్రమే నడుస్తున్నాయి. రెగ్యులర్ రైళ్వే సర్వీసులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి.

Similar Posts

Share it