భారత్ సహా 20 దేశాలపై సౌదీ అరేబియా ప్రయాణ నిషేధం

భారత్ సహా 20 దేశాలపై సౌదీ అరేబియా ప్రయాణ నిషేధం

దేశంలో కోవిడ్ 19 కేసులు పెరుగుతుండటంతో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా 20 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించింది. పలు దేశాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం రేపటంతోపాటు..దేశంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ తాత్కాలిక నిషేధం టర్కీతోపాటు పోర్చుగల్, స్వీడన్, స్విట్జర్లాండ్, లెబనాన్, ఐర్లాండ్, అమెరికాతోపాటు మరికొన్ని దేశాలు ఉన్నాయి.

ఇప్పటికే నిషేధం అమల్లో ఉన్నప్పటికీ గత 14 రోజులుగా ఆయా దేశాల్లో ప్రయాణించిన వారికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. సౌదీ అరేబియాలో ఇఫ్పటివరకూ 3.68 లక్షల కేసులు నమోదు కాగా,,6400 మంది చనిపోయారు. జనవరి నుంచి రోజు వారీ కేసులు మూడింతలు పెరగటంతో ఆ దేశంలో ఆందోళన నెలకొంది. రియాద్ ఇఫ్పటికే ట్రావెల్ బ్యాన్ ను మే 17 వరకూ పొడిగించింది.

Similar Posts

Recent Posts

International

Share it