పర్యాటకానికి కీలకం కానున్న 'వ్యాక్సిన్'

పర్యాటకానికి కీలకం కానున్న వ్యాక్సిన్

వ్యాక్సిన్ వేసుకుంటేనే దేశంలోకి అనుమతి. అది కూడా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్ ఉంటేనే పలు దేశాలు పర్యాటకులను ఆయా దేశాల్లోకి అనుమతించాలని నిర్ణయించాయి. చాలా దేశాలు ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు. కరోనా కారణంగా దాదాపు పది నెలల పాటు పర్యాటకం దారుణంగా దెబ్బతిన్నది. పలు దేశాల్లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొన్నా..మరికొన్ని దేశాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. తాజాగా సీషెల్స్ ఏ దేశం నుంచి అయినా తమ దగ్గరకు పర్యాటకులు రావొచ్చని..అయితే ఖచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని పేర్కొంది.

రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవటంతోపాటు ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీ పీసీఆర్ నెగిటివ్ రిపోర్టు కలిగిఉండాలని పేర్కొంది. ఈ మేరకు సీషెల్స్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్చిలో మాత్రం వ్యాక్సిన్ తో సంబంధం లేకుండా కోవిడ్ 19 నెగిటివ్ రిపోర్టు ఉన్న వారందరినీ అనుమతించాలని యోచిస్తోంది. సీషెల్స్ జనాభాలో 25 శాతం మందికి మార్చి నాటికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. సింగపూర్ తోపాటు పలు దేశాలు కూడా ఇదే తరహా విధానాన్ని అనుసరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Similar Posts

Recent Posts

International

Share it